- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Moto G96 5G: మోటోరోలా నుంచి అదిరిపోయే ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే!
మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో 5G వినియోగం విపరీతంగా పెరిగిన సంగతి

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో 5G వినియోగం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే మార్కెట్లోకి సరికొత్త మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటారోలో... ఇండియన్ మార్కెట్లోకి కొత్త మొబైల్ ఫోన్ లాంచ్ చేసింది. మోటో g96 5G పేరుతో కొత్త మొబైల్ తీసుకువచ్చింది.
ఇందులో అదిరిపోయే ఫీచర్స్ కూడా ఉన్నాయి. మోటో g96 5G (Moto G96 5G) మొబైల్ ఫోన్ లో 6.67 అంగుళాల డిస్ప్లే వస్తుంది. కార్నింగ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హల్లో యు ఐ టెక్నాలజీ తో ఈ మొబైల్ ఫోన్ పనిచేస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. మొబైల్ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే 5550 mah సామర్థ్యం ఉంటుంది.
ఇక ఈ మోటో g96 5G... రెండు మోడల్స్ లో మార్కెట్లోకి రానుంది. 8 జీబీ + 128 జీబీ మోడల్ మొబైల్ ఫోన్ ద్వారా 18 వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. అలాగే 8gb + 256 జిబి మోడల్ ధర 20వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఈ మొబైల్ ఫోన్స్ జూలై 16వ తేదీ నుంచి మార్కెట్లోకి రాబోతున్నాయి.






