Moto G35 5G: మోటోరోలా నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర కేవలం రూ. 9,999 మాత్రమే..!

by Maddikunta Saikiran |

చైనా(China)కు చెందిన ప్రముఖ టెక్ బ్రాండ్ మోటారోలా(Motorola) జీ సిరీస్(G Series)లో కొత్త మొబైల్ విడుదల చేసింది.

Moto G35 5G: మోటోరోలా నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర కేవలం రూ. 9,999 మాత్రమే..!
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ టెక్ బ్రాండ్ మోటారోలా(Motorola) జీ సిరీస్(G Series)లో కొత్త మొబైల్ విడుదల చేసింది. మోటో జీ35 5జీ(Moto G35 5G) పేరుతో దీన్ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 4జీబీ+128జీబీ వేరియంట్ ధరను కంపెనీ రూ. 9,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ రెడ్, లీఫ్ గ్రీన్, మిడ్ నైట్ బ్లూ కలర్స్ లో లభిస్తాయి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌(Flipkart) తో పాటు మోటోరోలా రిటైల్ షాప్స్(Retail Shops)లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

మోటో జీ35 5జీ స్పెసిఫికేషన్స్..

  • 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్‌ప్లే
  • క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ ప్రాసెసర్ తో ఈ స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది.
  • ఆండ్రాయిడ్ 14 హల్లో యూఐ స్కిన్ తో నడుస్తుంది.
  • 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్ రేటు ఇచ్చారు.
  • ఇక బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉన్నాయి
  • సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు.
  • 20W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh కెపాసిటీ బ్యాటరీ కలిగి ఉంటుంది.
  • హ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3.5 mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
Next Story