Most Expensive Elements In World: గోల్డ్ కాదు.. సిల్వర్ కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆభరణాలు ఇవే

by Vennela |   (  Updated:2025-04-27 14:11:55  IST  )

Most Expensive Elements In World: ప్రస్తుతం బంగారం ధర ఒక లక్ష రూపాయలకు సమీపానికి చేరుకుంది.

Most Expensive Elements In World: గోల్డ్ కాదు.. సిల్వర్ కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆభరణాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: Most Expensive Elements In World: ప్రస్తుతం బంగారం ధర ఒక లక్ష రూపాయలకు సమీపానికి చేరుకుంది. ఇప్పటికే ఒకసారి బంగారం ధరమ్ ఒక లక్ష రూపాయల పైన ఆల్ టైం రికార్డును సైతం నమోదు చేసింది. అయితే ఈ భూమిపైన బంగారంతో పాటు విలువైన లోహాలు అనేకం ఉన్నాయి. వీటి ధర బంగారం కన్నా చాలా ఎక్కువ అలాంటి లోహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. . వీటి ధర బంగారం కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది.

క్యాలిఫోర్నియం: అత్యంత అరుదుగా కనిపించే ఈ లోహాన్ని న్యూక్లియర్ రియాక్టర్లలో సింథటిక్‌గా తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. దీని ధర ఒక ఔన్స్ ( 31.2 గ్రాములు) సుమారు 750 మిలియన్ డాలర్లు మన భారతీయ కరెన్సీలో దీని విలువ 622 కోట్ల రూపాయలు. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన లోహం.

రోడియం: బంగారం కన్నా విలువైన మరో లోహం రోడియం. ఇది బాగా మెరిసే లక్షణాలు కలిగి ఉంటుంది. దీన్ని తుపాకీ, కార్లు, ఇండస్ట్రియల్ పరికరాల్లో బాగా ఉపయోగిస్తారు.ఒక ఔన్స్ (31.2 గ్రాములు) ధర సుమారు 4,650 డాలర్లు 3,86,950 రూపాయలు.

పల్లాడియం: దీని ధర ప్రస్తుతం బంగారం కన్నా తక్కువగా ఉన్నప్పటికీ విలువైన లోహాలు ఒకటిగా పేరు ఉంది. కార్ల క్యాటలిటిక్ కన్వర్టర్స్, ఎలక్ట్రానిక్స్‌లో దీన్ని వినియోగిస్తారు. దీని ధర ఒక ఔన్స్ సుమారు 1,022 డాలర్లు

ప్లాటినం: ఒకప్పుడు బంగారం కన్నా అత్యంత విలువైన లోహం గా పేరు ఉన్నటువంటి ప్లాటినం ద్వారా ప్రస్తుతం స్థిరంగా నిలిచిపోయింది. అయితే ఇప్పటికీ కూడా దీన్ని విలాసవంతమైన అభరణాల్లో ఒకటిగా ఉపయోగిస్తారు. ధృడత్వం, ప్రకాశవంతంగా మెరుపును అందించే లోహాల్లో ఇది ఒకటిగా పేరుంది. దీని ధర ఒక ఔన్స్ సుమారు 1,005 డాలర్లుగా ఉంది.

ఆస్మియం: ఫౌంటెన్ పెన్ నిబ్స్, ఎలక్ట్రికల్ వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. ధర సుమారు ప్రతి ఔన్స్ 400 డాలర్లుగా ఉంది.

రుతేనియం: దీన్ని ఎలక్ట్రానిక్స్, కెమికల్ రియాక్షన్లలో క్యాటలిస్ట్‌గా ఉపయోగిస్తారు. ఒక ఔన్స్ ధర సుమారు 410 డాలర్లు.

రీనియం: హై టెంపరేచర్ అలాయ్ తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. దీని ధర ఒక ఔన్స్ కు 46.87 డాలర్లుగా ఉంది.

వెండి: బంగారం తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయే లోహం వెండి ఇది కూడా చక్కటి మెరుపు కలిగి ఉంటుంది. దీని ధర ఒక ఔన్స్ ప్రస్తుతం 21 డాలర్లుగా ఉంది.

Next Story