Morgan Stanley: డిసెంబర్ 2025 వరకు సెన్సెక్స్‌ 1,05,000 పాయింట్లకు చేరే అవకాశం: మోర్గాన్‌ స్టాన్లీ

by Maddikunta Saikiran |

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ(BSE) సూచీ సెన్సెక్స్(Sensex) డిసెంబర్ 2025 నాటికి 1,05,000 పాయింట్ల స్థాయికి చేరే అవకాశాలు ఉన్నట్లు గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ(Morgan Stanley) అంచనా వేసింది.

Morgan Stanley: డిసెంబర్ 2025 వరకు సెన్సెక్స్‌ 1,05,000 పాయింట్లకు చేరే అవకాశం: మోర్గాన్‌ స్టాన్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ(BSE) సూచీ సెన్సెక్స్(Sensex) డిసెంబర్ 2025 నాటికి 1,05,000 పాయింట్ల స్థాయికి చేరే అవకాశాలు ఉన్నట్లు గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ(Morgan Stanley) అంచనా వేసింది. ఒకవేళ అది పాసిబుల్(Possible) కాకపోతే కనీసం 93,000 పాయింట్ల స్థాయిలో సెన్సెక్స్‌ నిలవొచ్చని స్పష్టం చేసింది. మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక ప్రకారం, అనుకోని పరిణామాలు లేదా ప్రతికూల పరిస్థితుల కారణంగా సెన్సెక్స్ 70,000 పాయింట్లకు తగ్గొచ్చు తప్ప అంతకంటే దిగువకు పడిపోయే అవకాశం లేదని తెలిపింది. సెన్సెక్స్ పెరుగుదలకు కార్పొరేట్‌ ఆదాయ వృద్ధి(CIG), ఈక్విటీ పెట్టుబడుల పెరుగుదల(EIG) వంటి అంశాలు అనుకూలంగా ఉంటాయని నివేదిక పేర్కొంది.

కాగా ఈ ఏడాది సెప్టెంబర్ లాస్ట్ వీక్(Last Week) నుంచి ఫారిన్ ఇన్సిటిట్యూషనల్ ఇన్వెస్టర్లు(FIIs) తమ పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీంతో మన బెంచ్ మార్క్ సూచీలు 6-7శాతం మేర నష్టాలను చవి చూశాయి. మళ్లీ గత నెల నుంచి నెమ్మదిగా పుంజుకున్నాయి. ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టినా, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశ స్టాక్ మార్కెట్(Indian stock market) అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. అలాగే 2025లో ఇన్వెస్టర్లు సరైన కంపెనీ ఎంచుకొని పెట్టుబడులు పెడితే మంచి ప్రాఫిట్స్(Profits) పొందుతారని నివేదిక సూచించింది.

Next Story