- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anil Ambani: అనిల్ అంబానీని వెంటాడుతున్న కష్టాలు.. కొత్తగా మరో కేసు
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఇచ్చిన రూ. 2,929.05 కోట్ల రుణాల మోసం కేసులో ఈ కేసు నమోదైంది.

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ గ్రూప్ అధినేత, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల రుణ మోసం వ్యవహారంలో సీబీఐ కేసు, సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ కేసును పరిగణలోకి తీసుకుని అనిల్ అంబానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీంఎల్ఏ) కింద కొత్త కేసు నమోదు చేసింది. గతంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఇచ్చిన రూ. 2,929.05 కోట్ల రుణాల మోసం కేసులో ఈ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో అనిల్ అంబానీతో పాటు కొందరు ప్రభుత్వాధికారులు, ఇతరులపై కేసు నమోదైంది. వివిధ బ్యాంకులకు రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్) రూ. 40 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఎస్‌బీఐకి మాత్రమే రూ. 2,929 కోట్ల నష్టం ఏర్పడింది. బ్యాంకు రుణాలు పొందడంలో కుట్ర ఉందని, ఆ రుణాలను దుర్వినియోగం చేసి అవకతవకలకు పాలడ్డారు. రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ ద్వారా బిల్లులను తక్కువగా చూపించడం, సేల్స్ ఇన్‌వాయిస్ విషయంలో దుర్వినియోగం జరిగాయని సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. గత నెలలో అనిల్ అంబాని, ఆర్‌కామ్ వల్ల ఎస్‌బీఐకి నష్టం ఏర్పడిందనే కారణంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అనిల్ అంబానీ ఇంటితో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించింది.






