- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: ఈ ఏడాది భారత వృద్ధి 6.4 శాతం
దేశీయ వినియోగం పటిష్టంగా ఉండటంతో పాటు అందుకు మద్దతుగా విధానపరమైన చర్యలు, తక్కువ ద్రవ్యోల్బణం వంటి పరిణామాలు వృద్ధికి దోహదపడుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.4 శాతం మేర పెరుగుతుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ అభిప్రాయపడింది. దీనివల్ల జీ-20 దేశాల్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ నిలుస్తుంది. ప్రధానంగా దేశీయ వినియోగం పటిష్టంగా ఉండటంతో పాటు అందుకు మద్దతుగా విధానపరమైన చర్యలు, తక్కువ ద్రవ్యోల్బణం వంటి పరిణామాలు వృద్ధికి దోహదపడుతున్నాయి. మరీ ముఖ్యంగా దేశీయ వినియోగమే భారత వృద్ధికి కీలకమైన చోదకంగా ఉందని మూడీస్ పేర్కొంది. ఇదే సమయంలో ఈ గిరాకీ కొనసాగడంలో ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. గతేడాది ఆఖరులో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పన్ను రేట్లను తగ్గించడం, అంతకుముందు యూనియన్ బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితులను పెంచడం, తద్వారా ప్రజలు ఖర్చు చేయడం వల్ల వృద్ధి మరింత వేగవంతంగా మారిందని మూడీస్ వివరించింది. ఇదే సమయంలో దేశ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి ప్రస్తావించిన మూడీస్, దేశీయ బ్యాంకింగ్ రంగం స్థిరంగా, సమర్థవంతంగా కొనసాగుతోంది. ఎంఎస్ఎంఈ విభాగంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ రంగ ఆస్తుల నాణ్యత బలంగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. ఏదైనా రుణాల విభాగంలో నష్టాలు ఎదురైతే, తగినంత బఫర్, నివలు బ్యాంకుల వద్ద ఉన్నాయని మూడీస్ పేర్కొంది.






