- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: ఈ ఏడాది భారత వృద్ధిని 6.3 శాతానికి తగ్గించిన మూడీస్
ఫలితంగా 2025లో దేశ జీడీపీ వృద్ధి 6.5 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గవచ్చని మూడీస్ పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఏడాదికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సవరించింది. అమెరికా విధానాల వల్ల ఏర్పడిన అనిశ్చితి, మారుతున్న అంతర్జాతీయ వాణిజ్య పరిణామాల వల్ల ప్రపంచ వృద్ధి నెమ్మదించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రభావం భారత్‌పై ఉంటుంది. ఫలితంగా 2025లో దేశ జీడీపీ వృద్ధి 6.5 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గవచ్చని మూడీస్ పేర్కొంది. ఇదే సమయంలో పాకిస్తాన్‌తో ముదిరిన వివాదం వల్ల భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు వృద్ధి అంచనాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని మూడీస్ అభిప్రాయపడింది. ముఖ్యంగా వినియోగదారు వ్యయం, వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్ని రకాల ఉత్పత్తులు, రంగాలపై అమెరికా సుంకం తగ్గింపు ఉన్నప్పటికీ విధానపరమైన నిర్ణయాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం, ప్రపంచ వాణిజ్య, పెట్టుబడుల వల్ల భారత్ కొత్త ఒత్తిడిని ఎదుర్కొనక తప్పదు. అయితే, 2026లో భారత్ ఇదివరకు అంచనా వేసినట్టుగానే 6.5 శాతం వద్దే స్థిరంగా కొనసాగగలదని, ఇందుకు ప్రధానంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రేట్లను మరింత తగ్గించడం ద్వారా వృద్ధికి మద్దతివ్వనున్నదని మూడీస్ వివరించింది. వాణిజ్య పరమైన ఆందోళనలతో పాటు, దక్షిణాసియా మొత్తంలో పరిస్థితులు దిగజారాయని మూడీస్ తెలిపింది. చైనా, ఫిలిప్పీన్స్ మధ్య కూడా ఇటీవల ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ తర్వాత రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో ఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది.






