- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Union Budget 2025: మోదీ మాస్టర్ స్ట్రోక్...బీహార్‌కు నిర్మలమ్మ వరాలు అందుకేనా?
Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్లో ఎన్నో ఆసక్తికర నిర్ణయాలు ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్లో ఎన్నో ఆసక్తికర నిర్ణయాలు ఉన్నాయి. ముందు నుంచి ఊహించినట్లుగానే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి. నితీష్ రాజకీయం గురించి బాగా తెలిసిన ప్రధాని మోదీ ఈ బడ్జెట్లో బిహార్ కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పలు ప్రాజెక్టులు కేవలం బిహార్ కోసమే ప్రకటించారు. బిహార్ ఎన్నికలకు బడ్జెట్ కేటాయింపులతో సమరశంఖం పూరించారని చెప్పవచ్చు.
కేంద్ర బడ్జెట్లో బిహార్ పైన వరాలు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కీలక భాగస్వామిగా ఉన్నారు. త్వరలోనే బిహార్ లో ఎలక్షన్స్ జరగనున్నాయి. దీంతో ఈ సారి బడ్జెట్లో బిహార్ కు ప్రాధాన్యత ఉంటుందని అంతా భావిస్తున్నారు. అంచనాలకు తగినట్లుగానే బిహార్ కు నిర్మలా సీతారామన్ పలు ప్రకటనలు చేశారు. బిహార్ లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. దీంతోపాటుగా పాట్నాలో ఐఐటీని విస్తరిస్తున్నట్లు తెలిపారు.
బడ్జెట్ లో బిహార్ కు నిజంగా చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిహారీలు చాలా సంవత్సరాలుగా మఖానాను పండిస్తున్నారు. మఖానా అంటే ఇదొక రకమైన ఆహారం. దేశంలో 90వాతం మఖానాను బిహార్ లో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఉత్తర బిహార్ ప్రాంతంలో అధికంగా పండిస్తారు. దీంతో ఆ ప్రాంతానికి మఖానా ప్రాంతం అనే పేరు కూడా వచ్చింది. బడ్జెట్ లో చేసిన ఈ ప్రకటనతో ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. మఖానాకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం దాని ఉత్పత్తిని మరింత ప్రోత్సహించాలని యోచిస్తోంది.
అదే విధంగా బిహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు. బిహార్ లో పశ్చిమ కోసి కెనాల్ ప్రాజెక్టు కోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామాన్ ప్రకటన చేశారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏకు నితీశ్ కుమార్ మద్దతు చాలా కీలకం. అదే సమయంలో బిహార్ లో రాజకీయంగానూ సమీకరణాలు రోజు రోజుకూ మరింత ఆసక్తిగా మారుతున్నాయి. నితీష్ ఎన్డీఏలో కొనసాగుతారా? జలక్ ఇస్తారా అనే చర్చ రాజకీయంగా వినిపిస్తోంది. అయితే అటు బిహార్ లో ఆర్జేడీ కూడా పుంజుకుంటోంది. దీంతో రాజకీయంగా ఆర్జేడీకి చెక్ పెట్టే యోచనలో మోదీ సర్కార్ పక్కా ప్లాన్ వేసినట్లే కనిపిస్తోంది.
అయితే బడ్జెట్ తో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే నితీష్ కేంద్రం వద్ద డిమాండ్లు ఉన్నట్లు సమాచారం. అయితే నితీశ్ ప్రతిపాదనలు అంగీకరిస్తూనే..అంతకు మించి అన్నట్లుగా కేంద్రం ఈ బడ్జెట్ లో బిహార్ పై వరాల జల్లులు కురిపించింది. జేడీయూ మద్దతు కేంద్రంలో కొనసాగుతుండటంతో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోందని చెప్పవచ్చు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన వరాలే రానున్న రోజుల్లో ప్రచారాస్త్రాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ ప్రకటనతో నితీశ్ స్పందన ఏవిధంగా ఉండబోతుందనేది కీలకంగా మారబోతోంది. అయితే రానున్న రోజుల్లో బిహార్ లో మాత్రం రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయం అనిపిస్తోంది.
మోదీ మాస్టర్ స్ట్రొక్ మాములుగా లేదు. ఒక్క రోజులో బిహార్ రాజకీయాలను షేక్ చేసింది బీజేపీ. కూటమిలో కీలకంగా ఉన్న నితీశ్‌కుమార్ కోసం చాలానే చేసింది. మిగిలిన రాష్ట్రాలను పక్కన పెట్టి మరీ బిహార్ కు పెద్దపీఠ వేసింది. దీనికి చాలా పెద్ద కారణమే ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కేవలం 240 సీట్లే వచ్చాయి. బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఎమ్మెల్యేలు ఆర్జీడీకి ఉన్నారు. పలు పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేలను చూస్తే ఆర్జేడీ 79, బీజేపీ 78, జేడీయూ 45, కాంగ్రెస్ 19, లెఫ్ట్ 16, హెచ్ఏఎం 4, ఎంఐఎం 1, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో ఉన్నారు. నితీశ్‌తో పాటు చంద్రబాబునాయుడు పార్టీల సపోర్ట్‌తో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది మోదీ సర్కార్. ఇందులో నితీశ్ ఏ టైమ్‌లో హ్యాండ్ ఇస్తారో తెలియదు. ఒకవేళ నితీశ్ హ్యాండిస్తే ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి.. అందుకే మోదీ ఇలా చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో బిహార్ కు ప్రత్యేక ప్రయోజనాలు చేకూర్చడం సహాజమే. కానీ ఏపీ ఏం పాపం చేసిందంటూ ప్రశ్నిస్తున్నారు.ఎన్డీఏ ఏర్పాటులో మూల స్తంబంగా నిలిచిన ఆంధ్రా ప్రాంతాన్ని బడ్జెట్ ప్రసంగంలో విస్మరించడం తగదంటూ ఆరోపణలు చేస్తున్నారు.






