- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Reciprocal Tariff: అమెరికా సుంకాలు మిశ్రమం, ఎదురుదెబ్బ కాదు: భారత్
మొదటి దశలో భాగంగా కనిష్ట సుంకం 10 శాతం ఏప్రిల్ 5 నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై ఉంటుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగానే భారత్‌పైనా అధిక 26 శాతం పరస్పర సుంకాలను విధించారు. భారత్‌తో పాటు అన్ని దేశాలపై కనిష్టంగా 10 శాతం సుంకం ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ సుంకాల ప్రకటన నేపథ్యంలో భారత్‌పై విధించిన 26 శాతం పరస్పర సుంకం వల్ల ఏర్పడే ఆర్థిక ప్రభావాన్ని ప్రభుత్వం అంచనా వేస్తోందని వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి గురువారం పీటీఐతో చెప్పారు. మొదటి దశలో భాగంగా కనిష్ట సుంకం 10 శాతం ఏప్రిల్ 5 నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై ఉంటుంది. మిగిలిన 16 శాతం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ సుంకాల ప్రభావాన్ని మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. సుంకాల ప్రభావం మిశ్రమంగా ఉంది. భారత్‌కు అనుకున్నంత ఎదురుదెబ్బ కాకపోవచ్చని, చర్చలకు అవకాశం ఉందని సదరు అధికారి తెలిపారు. అమెరికా చెబుతున్న వాణిజ్య సమస్యలను పరిష్కరిస్తే సుంకాలను సవరించే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వం సంకేతాలిచ్చింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి, ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ఒప్పందం మొదటి దశను ఖరారు చేయాలని ఇరుపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరోవైపు, ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనల నేపథ్యంలో భారత ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. సీనియర్ మంత్రిత్వ శాఖ అధికారులు సుంకాలను, వాటి ప్రభావన్ని పర్యవేక్షించి, పరిణామాలను ట్రాక్ చేస్తున్నారు.
అంతకుముందు వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో తన ప్రసంగంలో ట్రంప్, సుంకాల విధింపు నిర్ణయాన్ని అమెరికన్ పరిశ్రమకు 'చారిత్రాత్మక క్షణం' అని ప్రకటించారు. "ఇది లిబరేషన్ డే (విముక్తి దినం)గా అభివర్ణించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్షణం. 2025, ఏప్రిల్ 2 అమెరికా పరిశ్రమ పునర్జన్మ పొందిన రోజు. అమెరికాను మళ్లీ సంపన్న దేశంగా మారిన రోజుగా చరిత్రలో గుర్తుండిపోతుంది' అని చెప్పారు. ఈ సందర్భంగా భారత్ గురించి ప్రస్తావించిన డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోడీని గొప్ప స్నేహితుడిగా చెబుతూనే, ఇండియా చాలా చాలా కఠినమైన దేశం. అమెరికాపై భారత్ 52 శాతం సుంకం విధిస్తోంది. అయినప్పటికీ వారు విధిస్తున్న దాంట్లో సగమే 26 శాతం సుంకం వసూలు చేస్తామని పేర్కొన్నారు.






