స్నానం చేయించే మిషన్.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

by Muthe.Rajitha |

స్నానం చేయించే మిషన్.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్ : జపాన్‌లోని సైన్స్‌ కంపెనీ "మిరాయ్ హ్యూమన్ వాషింగ్ మెషిన్" అంటే మనిషికి స్నానం చేయించే మిషన్ ను తయారు చేసింది. ఈ మెషిన్‌ 15 నిమిషాల్లో బాడీని క్లీనింగ్‌, స్కిన్ స్క్రబ్బింగ్‌, డ్రైయింగ్‌ చేస్తుంది. టోక్యోలో జరిగిన ఒసాకా–కాన్సాయ్ ఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించారు. అయితే 40,000 మంది ఈ మిషన్ ను ట్రై చేయడానికి దరఖాస్తు చేయడంతో భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ను కమర్షియల్‌గా మార్కెట్లోకి తేవాలని కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ మెషిన్‌ ధర వింటే దిమ్మ తిరగాల్సిందే.

60 మిలియన్ యెన్‌ లు అనగా ఇండియన్ కరెన్సీలో సుమారు ₹3 కోట్లు. కానీ దీనిని కేవలం హోటళ్లు, స్పాలు వంటి ప్రొఫెషనల్ అవసరాలకే విక్రయించనున్నట్లు కంపెనీ నిర్వాహకులు స్పష్టం చేశారు. 1 మీటర్ వెడల్పు, 2.5 మీటర్ లోతు, 2.6 మీటర్ ఎత్తు కలిగిన ఈ పాడ్‌ లోపలికి వెళితే, మనిషి ప్రమేయం లేకుండానే శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది. స్నానం చేస్తున్నంత సేపు మ్యూజిక్ కూడా ప్లే అవుతుందట. అయితే 40–50 యూనిట్లు మాత్రమే తయారు చేసి బ్రాండ్‌ వాల్యూ కాపాడాలని కంపెనీ ఆలోచిస్తుందట.

Next Story