Budget Scooty : మధ్యతరగతి బడ్జెట్ స్కూటీ..క్రేజీ న్యూస్ !

by Y. Venkata Narasimha Reddy |

Budget Scooty : మధ్యతరగతి బడ్జెట్ స్కూటీ..క్రేజీ న్యూస్ !
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్య తరగతి ప్రజల(Middle class people)కు బడ్జెట్ స్కూటీ(Budget Scooty)గా మార్కెట్ లోకి దూసుకొచ్చింది జెన్ 3 ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్(Gen 3 Ola S1 X Plus). ఎలక్ట్రిక్ వెహికల్స్(Electric Vehicles)లో కనీస ధరతో బెస్ట్ ఫీచర్లతో లాంఛ్ అయిన ఈ స్కూటి ధర.. ఫీచర్లు మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 242 కి.మీ వరకు ప్రయాణించడం ఈ స్కూటీ ప్రత్యేకత. దీని ధర రూ.1.05 లక్షలు. తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా వాహనరంగ నిపుణులు చెబుతున్నారు. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో రూపుదిద్దుకుంది. వీటి కంటే ముందు జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కేవలం 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మాత్రమే ఉండేది. అలాగే ఈ జెన్3 ఎస్1 ఎక్స్ ప్లస్ పోర్టబుల్ 750 వాట్ ఛార్జర్‌తో వస్తుంది. దీని బ్యాటరీ పరిమాణం కూడా పెద్దదే. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. దాదాపుగా 242 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

స్పీడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మిడ్ డ్రైవ్ మోటారుతో 11 కిలోవాట్ల పీక్ పవర్ ఔట్‌పుట్‌ను ఇవ్వడం జెన్ 3 ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్​ స్కూటీ మరో ప్రత్యేకత.​బెస్ట్ ఫీచర్లతో తక్కువ బడ్జెట్‌లో స్కూటీ తీసుకోవాలనుకుంటే ఈ జెన్ 3 ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటీ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.

Next Story