- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Microsoft: భారత్‌లో మైక్రోసాఫ్ట్ రూ. 1.57 లక్షల కోట్ల పెట్టుబడి
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్లలో మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ప్రపంచ దిగ్గజాలు పోటీ పడుతున్న తరుణంలో, గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో 17.5 బిలియన్ డాలర్ల(రూ. 1.57 లక్షల కోట్ల)ను పెట్టుబడి పెడుతుందని కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల మంగళవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. భారత్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) లక్ష్యాలను అధిగమించేందుకు కమెనీ ఈ పెట్టుబడులకు సిద్ధమైందని తెలిపారు. ప్రధాని మోడీతో ఏఐ సంబంధించిన అవకాశాలపై స్ప్రూతిదాయకమైన సంభాషణ మా మధ్య జరిగిందని అన్నారు. దేశ ఏఐ ఆశయాలకు మద్దతుగా, భవిష్యత్తుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాలను నిర్మించడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అందిస్తుందని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. మరో నాలుగేళ్లలో ప్రకటించిన పెట్టుబడులను ఉపయోగిస్తాం. ఈ ఏడాది జనవరిలో కంపెనీ ప్రకటించిన 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఇది అదనమని వెల్లడించారు.






