- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Microsoft: వెళ్లిపోయే ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ స్పెషల్ ప్యాకేజీ
కంపెనీలో పని చేసిన సంవత్సరాలు, ఉద్యోగి వయస్సు కలిపి 70 ఏళ్లు దాటిన వారు ఈ పథకానికి అర్హులు.

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. అమెరికాలోని దీర్ఘకాల ఉద్యోగులకు ఈ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తూ, ఆరోగ్య సంరక్షణ, నగదు చెల్లింపులు, స్టాక్ ప్రయోజనాలతో కూడిన ‘ఎగ్జిట్ ప్యాకేజ్’ను ప్రకటించింది. కంపెనీలో పని చేసిన సంవత్సరాలు, ఉద్యోగి వయస్సు కలిపి 70 ఏళ్లు దాటిన వారు ఈ పథకానికి అర్హులు. ఈ ప్యాకేజీలో ప్రధాన ఆకర్షణ ఐదేళ్ల వరకు ఆరోగ్య సంరక్షణ మద్దతు. మొదటి ఏడాది వైద్య, దంత, కంటి చికిత్సల ఖర్చులను కంపెనీ పూర్తిగా భరిస్తుంది. తర్వాతి నాలుగేళ్ల పాటు ఉద్యోగులు తమ ప్రీమియంలు చెల్లిస్తూ అదే కవరేజ్ కొనసాగించుకోవచ్చు. దీంతో పాటు, ఉద్యోగి హోదా, సర్వీస్ కాలాన్ని బట్టి ఒకేసారి చెల్లించే సెవరెన్స్ ప్యాకేజీ కూడా ఉంటుంది. మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులకు గరిష్టంగా 39 వారాల జీతం వరకు ప్రయోజనం లభించే అవకాశం ఉంది. స్టాక్ ప్రయోజనాలను కూడా మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేస్తోంది. నివేదికల ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో దాదాపు 7 శాతం మంది, అంటే సుమారు 8,750 మంది ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు. ఈ ప్రోగ్రామ్ కోసం కంపెనీ సుమారు 900 మిలియన్ డాలర్ల వ్యయాన్ని భరించనుంది. మరోవైపు, త్వరలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. ఏఐ కోసం పెట్టుబడులు, ఖర్చుల నియంత్రణ నేపథ్యంలో ఈ లేఆఫ్స్ ఉండనున్నట్టు తెలుస్తోంది.






