Microsoft: ఏఐ విస్తరణకు టీసీఎస్, కాగ్నిజెంట్, ఇతర ఐటీ దిగ్గజాలతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం

by S Gopi |

ఎజెంటిక్ ఏఐ విస్తరణ కోసం ప్రముఖ కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్టు చెప్పారు

Microsoft: ఏఐ విస్తరణకు టీసీఎస్, కాగ్నిజెంట్, ఇతర ఐటీ దిగ్గజాలతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భారత పర్యటన సందర్భంగా కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవలే ఏఐ కోసం రూ. లక్షన్నర కోట్ల పెట్టుబడులు ప్రకటించిన తర్వాత గురువారం మరో కీలక ప్రకటన చేశారు. 'ఇండియా ఏఐ టూర్ 'లో భాగంగా ఎజెంటిక్ ఏఐ విస్తరణ కోసం ప్రముఖ ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా ఒక్కో కంపెనీ 50,000 కంటే ఎక్కువ మైక్రోసాఫ్ట్ కోపైలట్ లైసెన్స్‌లను ఉపయోగిస్తాయి. తద్వారా మొత్తంగా 2 లక్షల లైసెన్స్‌లను ఈ కంపెనీలు వినియోగిస్తాయి. దీనివల్ల మైక్రోసాఫ్ట్ ఏఐ విస్తరణకు కొత్త బెంచ్‌మార్క్‌ ఏర్పడుతుందని సత్య నాదెళ్ల తెలిపారు. భాగస్వామ్యం కుదుర్చుకున్న భారత ఐటీ కంపెనీలు ఏఐని పరీక్షించడం మాత్రమే కాదు, రోజువారీ పనిని వేగవంతం చేస్తుందని కంపెనీ చెబుతోంది. భారత్ డెవలపర్‌లకు ప్రపంచంలోని అగ్ర దేశాలలో ఒకటిగా మారుతోందని కూడా అన్నారు. డెవలపర్లు ఏఐతో విజయం సాధించాలంటే, సరైన నేర్చుకోవాలనే సంకల్పం కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఏఐ ఇంటిగ్రేషన్ ఉద్యోగులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, కంపెనీ వృద్ధి-అభివృద్ధికి దోహదపడటానికి సహాయపడుతుందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

Next Story