- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Microsoft: మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మైక్రోసాఫ్ట్
ఈ లేఆఫ్స్ అన్ని స్థాయిలు, టీమ్స్, ప్రాంతాలలో వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేయనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ తొలగింపుల ప్రభావం ఉండనుంది. కంపెనీ తన మొత్తం ఉద్యోగుల్లో 3 శాతం మందికి ఉద్వాసన పలకనుంది. ఇది దాదాపు 7,000 మంది ఉద్యోగులకు సమానం. ఈ లేఆఫ్స్ అన్ని స్థాయిలు, టీమ్స్, ప్రాంతాలలో వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేయనుంది. 2023లో కంపెనీ ఒకేసారి 10,000 మందిని ఇంటి పంపగా, ఈసారి తొలగింపు కంపెనీ చరిత్రలోనే రెండొ అతిపెద్దది కానుంది. మైక్రోసాఫ్ట్ వివరాల ప్రకార కంపెనీలో మొత్తం 2.28 లక్షల మంది ఉద్యోగులున్నారు. అత్యంత వేగంగా టెక్ రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో ఇతర కంపెనీల కంటే పైచేయి సాధించే లక్ష్యంలో భాగంగా మార్పులు చేపడుతున్నట్టు కంపెనీ వివరించింది. దీనికోసం ఖర్చులను తగ్గించడం అవసరమని భావించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. మేనేజ్‌మెంట్ స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే కాకుండా కంపెనీ కార్యకలాపాలను క్రమబద్దీకరించడం ముఖ్యమని కంపెనీ వెల్లడించింది. కంపెనీ వర్గాల ప్రకారం, ఈసారి లేఆఫ్స్ ప్రధానంగా మిడ్-మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఎక్కువ ప్రభావం చూపవచ్చని సమాచరాం. ఎందుకంటే, కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగుల పని పరిధిని పెంచడం ద్వారా కార్యకలాపాల్లో క్రమబద్దీకరణ చేపట్టాలని నిర్ణయించింది.






