- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fake Notes: నకిలీ రూ. 500 నోట్లపై కేంద్ర హోంశాఖ హెచ్చరిక
ప్రజలు అటువంటి నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: చెలామణిలోకి వచ్చిన కొత్త రకం నకిలీ రూ. 500 కరెన్సీ నోట్లకు సంబంధించి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) 'కీలకా హెచ్చరిక జారీ చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రూ. 500 దొంగనోట్లు వ్యవస్థలో చెలామణిలోకి వచ్చాయని, ప్రజలు అటువంటి నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇదే అంశంపై డీఆర్‌ఐ, ఎఫ్‌ఐయూ, సీబీఐ, ఎన్‌ఐఏ, సెబీ వంటి కీలక ఆర్థిక, నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. కొత్త దొంగనోట్ల ముద్రణ, నాణ్యత విషయంలోనూ అచ్చు అసలైన నోట్లను పోలీ ఉన్నాయని తెలిపింది. దొంగనోట్లను గుర్తించడం చాలా క్లిష్టంగా మారిందని హెచ్చరించింది. అయితే, నకిలీ నోట్లు ఒరిజినల్ రూ. 500 నోట్లకు సమానంగానే ఉన్నప్పటికీ చిన్న లోపం ఉంది. దాన్ని గుర్తించడం ముఖ్యమని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. నకిలీ నోట్లపైన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' పేరులో ఉండే 'రిజర్వ్' అనే ఇంగ్లీష్ పదంలో 'ఈ' అనే అక్షరానికి బదులు 'ఏ' అక్షరం ఉంటుంది. నిశితంగా పరిశీలించడం ద్వారా దీన్ని గుర్తించవచ్చని, ప్రజలు, సంస్థలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద కరెన్సీ గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. ఇప్పటికే వ్యవస్థలో ఈ నోట్లు చెలామణిలోకి వచ్చాయి. కానీ, మార్కెట్లో ఎన్ని నోట్లు ఉన్నాయనే దానిపై స్పష్టత లేదని తెలుస్తోంది.






