వాహనదారులకు శుభవార్త.. ఈ కార్లపై రూ.2.30 లక్షల డిస్కౌంట్..!

by velandi.Saikiran |

మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా.. కార్లు వస్తున్నాయి. అయితే

వాహనదారులకు శుభవార్త.. ఈ కార్లపై  రూ.2.30 లక్షల డిస్కౌంట్..!
X

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా.. కార్లు వస్తున్నాయి. అయితే అలాంటి వాటిలో JNW MG మోటార్ ( JSW MG Motor India) ఒకటి. ఈ కంపెనీ ఇండియాలోకి వచ్చి ఆరు సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే కంపెనీ నుంచి అదిరిపోయే ఆఫర్ కూడా వచ్చేసింది. ఈ కంపెనీకి సంబంధించిన ఒక్కో వేరియంట్ పై... రకరకాల డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి.

2.30 లక్షల వరకు రాయితీలు ఇస్తోంది కంపెనీ. ముఖ్యంగా... షార్ప్ ప్రో 1.5 పెట్రోల్ ఎంఎన్టి మోడల్ కారుపై అత్యధికంగా 2.14 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. అంటే ఈ కారు ప్రస్తుతం 19 లక్షల కి లభిస్తుందన్నమాట. స్నో స్మార్ట్, బ్లాక్ స్మార్ట్ మోడల్ కార్లపై కూడా డిస్కౌంట్ ఉంది. హెక్టర్ ప్లస్ విషయానికి వస్తే... ఇందులో షార్ప్ ప్రో 1.5 పెట్రోల్ ఎమ్ ఎన్ టి మోడల్ పై రూ.2.30 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.

హెక్టార్ ప్లస్ సెవెన్ సీటర్ మోడల్ లో షార్ప్ 1.5 పెట్రోల్ వేరియంట్ పైన కూడా రూ.2.30 లక్షల డిస్కౌంట్ ఉంది. సెలెక్ట్ ప్రో, షార్ప్ ప్రో, సావి ప్రో లాంటి డ్రీమ్స్ పైన కూడా రెండు లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. అయితే బేస్ వేరియంట్ స్టైల్ ట్రిమ్ ధర మాత్రం 25 వేల రూపాయలు పెంచారు.

Next Story