Meta: దాదాపు 4,000 మందిని తొలగించేందుకే సిద్ధమైన మెటా

by S Gopi |
Meta: దాదాపు 4,000 మందిని తొలగించేందుకే సిద్ధమైన మెటా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టెక్ దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్స్ మరోసారి భారీ తొలగింపులకు సిద్ధమైంది. ఈసారి ఏకంగా 3,600 మందికి ఉద్వాసన పలనుందని సమాచారం. దీనికి సంబంధించి గత వారమే ఉద్యోగులకు సమాచారం అందించగా, ఫిబ్రవరి 10(నేడు) ఉద్యోగులకు పింక్‌స్లిప్‌లు జారీ చేయనున్నట్టు మనీకంట్రోల్ పేర్కొంది. కంపెనీలో పనితీరు సరిగాలేని ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మెటా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ కారణంగానే కంపెనీ భారీ లేఆఫ్ ప్రక్రియను చేపట్టినట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నిర్ణయంతో తొలగింపుల్లో 5 శాతం మందిపై ప్రభావం ఉండనుంది. కంపెనీ సీఈఓ మార్క్ జకర్‌బర్గ్ గత నెల తన సిబ్బందితో మాట్లాడుతూ, సరైన పనితీరు లేనివారిని తక్షణం తొలగించే చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్ సహా అంతర్జాతీయంగా 12 దేశాల్లో ఈ తొలగింపులు ఉండనున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారికి సంస్థ నుంచి అందాల్సిన ప్యాకేజీ లభిస్తుందని మార్క్ జకర్‌బర్గ్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed