- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Whatsapp: ఇకపై వాట్సాప్‌లోనూ యాడ్స్
ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ప్రకటనదారులతో నేరుగా సంప్రదించేందుకు వీలవుతుందని వాట్సాప్ భావిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వినియోగంలో ఉన్న వాట్సాప్‌లో ఇకపై యాడ్స్ ప్రత్యక్షం కానున్నాయి. మెటాకు చెందిన ఫేస్‌బుక్ దీన్ని కొనుగోలు చేసిన 11 ఏళ్ల నుంచి ఉచితంగానే అందిస్తున్న వాట్సాప్ సేవల్లో తొలిసారిగా యాడ్స్‌కు అనుమతివ్వనుంది. దీనికి సంబంధించి తాజాగా వాట్సాప్ తన బ్లాగ్ పోస్ట్‌లో ఇటువంటి ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్టు పేర్కొంది. యాప్‌లో ఉండే అప్‌డేట్స్ ట్యాబ్‌లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ప్రకటనదారులతో నేరుగా సంప్రదించేందుకు వీలవుతుందని వాట్సాప్ భావిస్తోంది. ప్రస్తుతం అప్‌డేట్స్ ట్యాబ్‌లో స్టేటస్‌లతో పాటు వివిధ ఛానెళ్లు కనిపిస్తున్నాయి. యాప్‌ను వినియోగిస్తున్న వారిలో 150 కోట్ల మంది ప్రతిరోజూ అప్‌డేట్స్ ట్యాబ్ చూస్తారు. కాబట్టి కొత్త యాడ్స్ ఫీచర్‌ను అప్‌డేట్స్ ట్యాబ్‌లో అందిస్తే వ్యాపారులు, ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుందని వాట్సా అభిప్రాయపడింది.
మూడు రకాల యాడ్స్
ముఖ్యంగా ఈ యాడ్స్ సదరు యూజర్లకు, వారు తమవారితో చాట్ చేసే సంభాషణల ఆధారంగా, ప్రమోషన్ ఆధారంగానే పనిచేస్తాయి. అదనంగా సెర్చ్ యాడ్స్, మెంబర్‌షిప్ ద్వారా వాట్సాప్ మానిటైజ్ చేయడం ప్రారంభిస్తుంది. మూడు రకాలుగా తీసుకొచ్చే యాడ్ ఫీచర్లలో.. ఒకటి, నెలవారీగా ఫీజు చెల్లించి ఇష్టమైన ఛానెల్‌కు సపోర్ట్ చేయవచ్చు. రెండోది, ఇప్పుడున్న ఛానెళ్లను ఎక్స్‌ప్లోర్ ద్వారా సెర్చ్ చేయవచ్చు. కొత్త ఫీచర్ వచ్చిన తర్వాత ఛానెల్ ఎక్కువమందికి చేరడానికి అడ్మిన్‌లు తమ విజిబిలిటీ కోసం కొంత ఫీజు చెల్లించి ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక చివరగా, ఇప్పటివరకు మనకు తెలిసిన వారి స్టేటస్‌లు మాత్రమే కనిపించే చోట, కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యాపారాల స్టేటస్ కూడా కనిపిస్తుంది.
యాడ్స్‌ఫ్రీగా చాట్స్
ఇక, కొత్త యాడ్స్ ఫీచర్ కేవలమ అప్‌డేట్స్ ట్యాబ్‌కు మాత్రమే పరిమితమని వాట్సాప్ స్పష్టం చేసింది. పర్సనల్‌గా మనం మేసేజ్ చేసుకునే చాట్ ఇప్పుడున్న మాదిరిగానే ఉంటుంది. అదేవిధంగా మేసేజ్, కాల్స్, స్టేటస్‌లు ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గానే ఉంటాయి. యాడ్స్, ఛానెళ్లకు సంబంధించి కస్టమర్ ఉండే దేశం, నగరం, భాషల వివరాలు మాత్రమే సేకరించనున్నట్టు స్పష్టం చేసింది.






