Meta: మెటా ఏఐ యూనిట్‌లో 600 మంది ఉద్యోగుల తొలగింపు

by S Gopi |

ఈ నిర్ణయంతో ఫేస్‌బుక్ ఏఐ రీసెర్చ్, ప్రోడక్ట్ ఏఐ, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కీలక విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితం..

Meta: మెటా ఏఐ యూనిట్‌లో 600 మంది ఉద్యోగుల తొలగింపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం మెటా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైనట్టు సమాచారం. కంపెనీకి చెందిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ విభాగంలో ఏకంగా 600 మందిని సాగనంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. దీని గురించి ఇప్పటికే కంపెనీ ఆయా ఉద్యోగులకు మెమో జారీ చేసిందని, ఈ నిర్ణయంతో ఫేస్‌బుక్ ఏఐ రీసెర్చ్, ప్రోడక్ట్ ఏఐ, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితం అయ్యారని సమాచారం. కొత్తగా ఏర్పాటైన టీబీడీ ల్యాబ్‌కు చెందిన ఉద్యోగులపై మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదని, ఇందులో నియామకాలు కొనసాగుతాయని తెలుస్తోంది. తాజా తొలగింపులతో కంపెనీ తన కార్యకలాపాలను మరింత వేగవంతంగా కొనసాగిస్తుందని కంపెనీ తన మెమోలో పేర్కొంది. లేఆఫ్ ద్వారా అనవసర పనులు తగ్గి, ఉన్న ఉద్యోగులు మరింత శ్రద్ధగా, ప్రభావవంతంగా పనిచేస్తారని మెటా ప్రతినిధి అలెగ్జాండర్ వాంగ్ చెప్పారు. అయితే, లేఆఫ్‌కు గురైన ఉద్యోగులకు కంపెనీలోనే ఇతర విభాగాల్లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నామని మెటా స్పష్టం చేసింది.

Next Story