ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ‘మెటా’.. విధుల నుంచి 700 మంది తొలగింపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-26 03:50:46  IST  )

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో భారీ మార్పుల దిశగా ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta) అడుగులు వేస్తోంది.

ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ‘మెటా’.. విధుల నుంచి 700 మంది తొలగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta), తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో భారీ మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ విభాగాలకు చెందిన సుమారు 700 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తను ప్రచురించింది. కంపెనీ తన AI కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి, విభాగాల మధ్య కో-ఆర్డినేషన్ పెంచడానికి ప్రక్షాళన చేపట్టింది. ఈ తొలగింపులు ప్రధానంగా AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫండమెంటల్ AI రీసెర్చ్ (FAIR), ఇతర ప్రొడక్ట్ సంబంధిత ఏఐ టీమ్స్‌పై ప్రభావం చూపాయి. ఒకే రకమైన పనులు చేసే టీమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని, అందుకే సంస్థను మరింత క్రమబద్ధీకరించాలని (Streamline) మెటా నిర్ణయించింది. అయితే, తొలగించిన ఉద్యోగులకు 16 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, వారు పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా రెండు వారాల వేతనాన్ని పరిహారంగా ఇవ్వనున్నట్లుగా సమాచారం.

Next Story