గ్లోబల్ బిజినెస్ హెడ్‌గా వికాస్‌ను నియమించిన మెటా!

by Disha Web Desk 17 |
గ్లోబల్ బిజినెస్ హెడ్‌గా వికాస్‌ను నియమించిన మెటా!
X

న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తన భారతీయ విభాగంలో గ్లోబల్ బిజినెస్ గ్రూప్ డైరెక్టర్‌గా వికాస్ పురోహిత్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. వికాస్ సంస్థ స్ట్రాటజీ, డెలివరీ విభాగాలను నిర్వహిస్తారని మెటా తెలిపింది. బ్రాండ్లు, ఏజెన్సీలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఆదాయ వృద్ధిని పెంచేందుకు వికాస్ పురోహిత్ బాధ్యతలు చేపడతారని కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

ఆయన కంపెనీలో చేరడం సంతోషంగా ఉందని, మెటాకు చెందిన అన్ని విభాగాలకు ఆదాయం పెంచే మార్గాలపై కృష్టి చేస్తారని, మెటా ప్లాట్‌ఫామ్ సహకారంతో వ్యాపార వృద్ధి, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సహాయపడతారని కంపెనీ అభిప్రాయపడింది. కాగా, వికాస్ పురోహిత్ ఇదివరకు టాటా గ్రూపునకు చెందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ టాటాక్లిక్ సీఈఓగా పనిచేశారు.

బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఐఐటీ పూర్తి చేసిన వికాస్‌కు, టాటా క్లిక్‌తో పాటు అంతకుముందు రిలయన్స్ బ్రాండ్స్, అమెజాన్, ఆదిత్య బిర్లా గ్రూప్, టామి హిల్‌ఫిగర్ వంటి కంపెనీల్లో 20 ఏళ్ల నుంచి సీనియర్ బిజినెస్, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది.

ఇవి కూడా చదవండి : గోల్డ్‌మన్ శాక్స్‌లో 3,200 మంది ఉద్యోగుల తొలగింపు!



Next Story

Most Viewed