భారీగా పెరగనున్న మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు!

by Disha Web Desk 17 |
భారీగా పెరగనున్న మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు!
X

న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ మోడళ్లపై రూ. 2 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు పెరుగుదల ఉంటుందని, పెంచిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులతో పాటు విదేశీ మారకం ఖరీదైన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దాంతో మూడు నెలల వ్యవధిలో మెర్సిడెస్ బెంజ్ తన వాహనాల ధరలను పెంచడం ఇది రెండోసారి.

కంపెనీ అధికారిక వివరాల ప్రకారం, కంపెనీ మోడళ్ల ఎక్స్‌షోరూమ్ ధరలపై 5 శాతం వరకు పెంపు ఉండనుంది. గత కొన్ని నెలల నుంచి యూరో కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి మారకం క్షీణిస్తోందని అందుకే కార్ల ధరలు పెంచాలని నిర్ణయించినట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సంతోష్ అయ్యర్ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్ ధర రూ. 2 లక్షలు, జీఎల్ఏ ఎస్‌యూవీ ధర రూ. 7 లక్షల వరకు పెరగనుంది. టాప్ ఎండ్ మేబ్యాక్ ఎస్ 580 రూ. 12 లక్షల మేర ఖరీదు కానుందని కంపెనీ వెల్లడించింది.

అంతకుముందు కంపెనీ జనవరి నెలలో కార్ల ధరలను 5 శాతం పెంచిన సంగతి తెలిసిందే. వినియోగదారులపై ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంతోష్ అయ్యర్ చెప్పారు.

Also Read...

అమెరికా కమ్యూనికేషన్ పరికరాల తయారీ కంపెనీని కొనుగోలు చేసిన జియో!


Next Story

Most Viewed