Mercedes Benz: జనవరి నుంచి కార్ల ధరలను 2 శాతం పెంచిన మెర్సిడెస్ బెంజ్

by S Gopi |

యూరోతో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటం వల్ల అన్ని కార్లపై పెంపు అమలు చేయాలని నిర్ణయించామని కంపెనీ తెలిపింది.

Mercedes Benz: జనవరి నుంచి కార్ల ధరలను 2 శాతం పెంచిన మెర్సిడెస్ బెంజ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. యూరోతో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటం వల్ల కార్ల సరఫరాలో ఖర్చులు పెరుగుతున్నాయని, దీన్ని భర్తీ చేసేందుకు 2026, జనవరి నుంచి అన్ని కార్లపై 2 శాతం పెంపు అమలు చేయాలని నిర్ణయించామని కంపెనీ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. ఫారెక్స్ ఒత్తిళ్లకు అనుగుణంగానే ధరలను 2 శాతానికి పరిమితం చేస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది కరెన్సీ మారకంలో ఎదురుగాలులు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగాయి. యూరో స్థిరంగా రూ. 100 మార్కుకు పైనే ఉంది. దీనివల్ల స్థానిక ఉత్పత్తి కోసం దిగుమతి చేసుకున్న విడిభాగాలు మొదలుకొని, పూర్తిగా నిర్మించిన యూనిట్ల వరకు అన్ని కార్యకలాపాలపైనా ప్రభావితం కనిపిస్తోందని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ,సీఈఓ సంతోష్ అయ్యర్ అన్నారు. పెరిగిన ఖర్చులను స్థానిక విడిభాగాలను కొనుగోలు చేయడం ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కార్యకలాపాల నిర్వహణ కోసం కొంత పెంపు తప్పనిసరి. అంతేకాకుండా ద్రవ్యోల్బణ ఒత్తిడి, ఇన్‌పుట్ ఖర్చులు, కమొడిటీ ధరలు, పెరిగిన లాజిస్టిక్ ఖర్చులు కంపెనీ లాభాలపై ఒత్తిడి కలిగిస్తాయని, అందుకే ధరలను సర్దుబాటు చేస్తున్నట్టు కంపెనీ వివరణ ఇచ్చింది.

Next Story