Mercedes Benz: ధరలు పెంచిన మెర్సిడెస్ బెంజ్

by S Gopi |

యూరో కరెన్సీ కారణంగా సెప్టెంబర్‌లో పెంపు నిర్ణయం అమల్లోకి రావొచ్చు.

Mercedes Benz: ధరలు పెంచిన మెర్సిడెస్ బెంజ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ధరలను పెంచేందుకు సిద్ధమైంది. యూరోతో పోలిస్తే రూపాయి బలహీనపడటంతో ఆ ప్రభావాన్ని తగ్గించడానికి సెప్టెంబర్ నుంచి ధరలను 1-1.5 శాతం పెంచాలని మెర్సిడెస్ బెంజ్ ఇండియా భావిస్తోందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. ఇప్పటికే కంపెనీ ఈ ఏడాదిలో రెండుసార్లు, జనవరితో పాటు జూలైలో కంపెనీ ధరలు సవరించింది. యూరో కరెన్సీ కారణంగా సెప్టెంబర్‌లో పెంపు నిర్ణయం అమల్లోకి రావొచ్చు. గత నెలలో యూరో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 100 మార్క్ వద్ద ఉంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలలో మారకం అవుతోంది. కరెన్సీ విలువ ఆధారంగా రానున్న రోజుల్లో వ్యత్యాసం ఏర్పడవచ్చు. అందుకనుగుణంగా సెప్టెంబర్ నాటికి ధరలు పెంచాల్సి వస్తుంది. అయితే, ధరల పెంపు వల్ల అమ్మకాలపై ప్రభావం ఉండకపోవచ్చని సంతోష్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల తగ్గింపు ఒకవిధంగా కొనుగోలుదారుల నెలవారీ ఖర్చును సమతుల్యం చేస్తుందని ఆయని తెలిపారు. దేశీయ వాహన మార్కెట్లో గిరాకీ ఇప్పటికీ మెరుగ్గానే ఉందని, ఆర్థికవ్యవస్థ వృద్ధి కొనసాగుతుండటం, ప్రజలు లగ్జరీ కార్లను కొనేందుకు ఇష్టపడం అమ్మకాలు కొనసాగేందుకు దోహదప్డుతుందని ఆయన వివరించారు. కరెన్సీ హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకుంటే, ధరలు కంపెనీ నియంత్రణకు మించిన బాధ్యత అనే విషయాన్ని కస్టమర్లు అర్థం చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

Next Story