- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్ నిబంధనలను నోటిఫై చేసిన కేంద్రం
మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో స్పష్టమైన నియంత్రణతో పాటు పారదర్శకత తీసుకురావడం లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఓజీఏఐ) అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే సమయంలో ఆన్‌లైన్‌గేమ్‌ల నిషేధానికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేసింది. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో స్పష్టమైన నియంత్రణతో పాటు పారదర్శకత తీసుకురావడం లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం, గేమ్‌ల సర్టిఫికేషన్ చెల్లుబాటు కాలాన్ని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. రియల్ మనీ గేమ్‌లు కాని వాటికి తప్పనిసరి రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. దీనివల్ల చిన్న గేమింగ్ స్టార్టప్‌లు, డెవలపర్‌లకు నిర్వహణ సులభతరమవుతుంది. కానీ, ఈస్పోర్ట్స్ గేమ్స్ మాత్రం చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని ఐటీ సెక్రటరీ ఎస్ కృష్ణన్ స్పష్టం చేశారు. వినియోగదారుల భద్రత కోసం తప్పనిసరి సేఫ్టీ ఫీచర్లు, అలాగే రెండు దశల ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. అథారిటీకి సంబంధించి ఆరుగురు అధికారులతో ఏర్పాటు చేశారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధితో పాటు ఆర్ధిక వ్యవహారాలు, సమాచార ప్రసార శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ, న్యాయశాఖ కార్యదర్శులు ఉంటారు.






