- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mehul Choksi: రూ. 2,566 కోట్ల మెహుల్ చోక్సీ ఆస్తుల వేలానికి పీఎంఎల్ఏ కోర్టు ఆమోదం
2018లో ఈడీ స్వాధీనం చేసుకున్న రూ. 2,565.9 కోట్ల విలువైన చోక్సీ ఆస్తుల వేలానికి కోర్టు ఆమోదం తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ కేసుకు సంబంధించి ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పీన్‌బీకి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి 2018లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్న రూ. 2,565.9 కోట్ల విలువైన చోక్సీ ఆస్తుల వేలానికి కోర్టు ఆమోదం తెలిపింది. స్వాధీనం చేసుకున్న ఆస్తులను వాటి నిజమైన యజమానులకు తిరిగి ఇచ్చేలా చేయడం కోసం ఈడీ సహకారంతో పీన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్ దాఖలు చేసిన ఉమ్మడి దరఖాస్తును అనుసరించి, కోర్టు మానిటైజేషన్ ప్రక్రియకు అధికారం ఇచ్చింది. ఇప్పటికే ముంబైలోని ఫ్లాట్లు, అంధేరీ ఈస్ట్‌లోని సీపేజ్‌లోని రెండు ఫ్యాక్టరీలు లాంటి ప్రధాన ఆస్తులతో సహా రూ. 125 కోట్ల విలువైన ఆస్తులు వేలం కోసం బదిలీ చేయబడ్డాయి. ఈ ఆస్తులు ప్రస్తుతం చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉన్నాయి. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ. 14,000 కోట్ల మోసానికి పాల్పడిన చోక్సీ, అతని మేనల్లుడు నీరవ్ మోదీ, ఇతరులతో కలిసి మోసం, అవినీతి, మనీలాండరింగ్ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.






