- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఏపీ, తెలంగాణలో 30 ముత్తూట్ మైక్రోఫిన్ బ్రాంచ్‌లు: సీఈఓ
దిశ, బిజినెస్ బ్యూరో: 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం 20-30 బ్రాంచ్‌లను ప్రారంభిస్తామని మైక్రోఫైనాన్స్ కంపెనీ ముత్తూట్ మైక్రోఫిన్ ఎండీ, సీఈఓ సదాఫ్ సయీద్ తెలిపారు. ప్రతి రాష్ట్రంలో నాలుగు బ్రాంచ్‌లను ప్రారంభించి, ఈ త్రైమాసికం నాటికి 20-30 శాఖలను కలిగి ఉండాలని చూస్తున్నట్లు ఆయన అన్నారు. ముత్తూట్ మైక్రోఫిన్ ప్రస్తుతం బాగా క్యాపిటలైజేషన్ చేయబడింది, కాబట్టి రాబోయే రెండేళ్లలో మూలధన పెంపు అవసరం లేదని, క్యాపిటల్ అడిక్వసీ రేషియో దాదాపు 29.60 శాతంగా ఉందని సదాఫ్ సయీద్ తెలిపారు.
2023-24 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ. 2,521 కోట్ల చెల్లింపులను చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ. 2,700 కోట్లుగా ఉంది. ముత్తూట్ మైక్రోఫిన్ సంస్థకు దాదాపు 32 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఇది తిరువనంతపురానికి చెందిన సంస్థ. దీనికి 18 రాష్ట్రాల్లో 1340 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, అట్టడుగు వర్గాల వారికి సూక్ష్మ రుణాలు అందిస్తోంది.