- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
McDonald's: 20 నిమిషాల్లో మెక్‌డొనాల్డ్స్ డెలివరీ
వచ్చే రెండేళ్లలో అమ్మకాలను 3-5 శాతం పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఫాస్ట్-ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్‌ను నిర్వహిస్తున్న వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ మరింత వేగంగా డెలివరీ అందించనున్నట్టు వెల్లడించింది. కంపెనీ తన యాప్ ద్వారా కేవలం 20 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ మోడల్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ సేవల ద్వారా వచ్చే రెండేళ్లలో అమ్మకాలను 3-5 శాతం పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ పేర్కొంది. 20 నిమిషాల్లో డెలివరీ ద్వారా వ్యాపారం మరింత పటిష్టమవుతుందని, థర్డ్ పార్టీలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటామని కంపెనీ సీఈఓ అక్షయ్ జాటియా స్పష్టం చేశారు. మెక్‌డొనాల్డ్స్‌కు 'మెక్‌డెలివరీ' యాప్ ఉంది. స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్‌ఫామ్‌లలోనూ లిస్ట్ అయినట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ మొత్తం అమ్మకాలలో డెలివరీల వాటా దాదాపు 40 శాతం ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో డెలివరీ సేవలందించేలా పైలట్ ప్రాజెక్ట్ రూపంలో లాంచ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. మరో రెండేళ్లలో తమ సొంత యాప్ ద్వారా డెలివరీ అమ్మకాలు రెట్టింపు అవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఇప్పటికే దేశీయంగా డొమినోస్ స్టోర్లను నిర్వహిస్తున్న పోటీ కంపెనీ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ తక్కువ ధర, 30 నిమిషాల్లో డెలివరీ మోడల్‌ను అందిస్తోంది.






