- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్‌గ్రేడ్ చేసిన మినీ ట్రక్ 'సూపర్ క్యారీ'ని విడుదల చేసిన మారుతీ సుజుకి!
దేశీయ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి తన అప్‌గ్రేడ్ చేసిన లైట్ కమర్షియల్ వెహికల్ సూపర్ క్యారీ వాహనాన్ని సోమవారం మార్కెట్లో విడుదల చేసింది.

న్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి తన అప్‌గ్రేడ్ చేసిన లైట్ కమర్షియల్ వెహికల్ సూపర్ క్యారీ వాహనాన్ని సోమవారం మార్కెట్లో విడుదల చేసింది. మెరుగైన పనితీరుతో పాటు మరింత నాణ్యతతో మినీ ట్రక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, ధరను రూ. 5.15 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
సాంప్రదాయ ఇంధనంతో పాటు సీఎన్‌జీ వేరియంట్‌ను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేసింది. పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే సూపర్ క్యారీ రూ. 5.15-5.30 లక్షల మధ్య ధరతో రాగా, సీఎన్‌జీ వేరియంట్ల ధరలు రూ. 6.15-6.30 లక్షల మధ్య ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ వంటి భద్రతాపరమైన సౌకర్యాలతో పాటు రివర్స్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వివరించింది.
ఏడేళ్ల క్రితం సూపర్ క్యారీ మినీ ట్రక్‌ను విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు లక్షన్నరకు పైగా యూనిట్లను విక్రయించామని, వినియోగదారుల నుంచి అప్‌గ్రేడ్ చేసిన మోడల్‌కు ఆదరణ బాగుందని మారుతీ సుజుకి మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.






