Maruti Suzuki: ఇకపై మారుతీ సుజుకి బడ్జెట్ కార్లలోనూ 6 ఎయిర్‌బ్యాగులు

by S Gopi |

అన్ని రకాలుగా వినియోగదారులకు మెరుగైన భద్రతను అందించడమే కంపెనీ తొలి ప్రాధాన్యత.

Maruti Suzuki: ఇకపై మారుతీ సుజుకి బడ్జెట్ కార్లలోనూ 6 ఎయిర్‌బ్యాగులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. తన పోర్ట్‌ఫోలియోలోని వ్యాగన్ఆర్, ఆల్టో కె10, సెలెరియో, ఈకో వంటి బడ్జెట్ కార్ మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను ప్రామాణికంగా అందించనున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అన్ని రకాలుగా వినియోగదారులకు మెరుగైన భద్రతను అందించడమే కంపెనీ తొలి ప్రాధాన్యత. దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆధునిక రోడ్డు మౌలిక సదుపాయాలు, హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, పెరుగుతున్న మొబిలిటీ వాహనాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతమైన భద్రతను అందించేందుకు అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను స్టాండర్డ్‌గా రూపొందించనున్నట్టు మారుతీ సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ అన్నారు. ఎక్కువమంది కొనుగోలు చేసే వ్యాగన్ఆర్, ఆల్టో కె10, సెలెరియో, ఈకోలలోనూ ఆరు ఎయిర్‌బ్యాగులను ఇవ్వడం ద్వారా దేశవ్యాప్తంగా వాహనదారుల భద్రతా ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయని, అందరి రక్షణకు సమగ్రమైన హామీ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Next Story