Maruti Suzuki: మరోసారి ధరలు పెంచిన మారుతీ సుజుకి

by S Gopi |

వివిధ మోడళ్ల ప్రకారం రూ.2,500-62,000 మధ్య ఈ పెరుగుదల ఉండనుంది.

Maruti Suzuki: మరోసారి ధరలు పెంచిన మారుతీ సుజుకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి వినియోగదారులకు వరుస షాక్‌లు ఇస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడుసార్లు ధరలు పెంచిన కంపెనీ బుధవారం మరోసారి తమ కార్లు ప్రియం కానున్నాయని ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ వ్యయం, నియంత్రణాపరమైన నిబంధనలు, కొత్త ఫీచర్లను అందించడం వంటి కారణాలతో ఏప్రిల్ 8 నుంచి ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. వివిధ మోడళ్ల ప్రకారం రూ.2,500-62,000 మధ్య ఈ పెరుగుదల ఉండనుంది. కంపెనీ ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి, వినియోగదారులపై ప్రభావం పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అన్ని రకాలుగా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కొంత పెరుగుదలను బదిలీ చేయక తప్పట్లేదని కంపెనీ వివరించింది. అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలలో భాగంగా కార్లు, ట్రక్కులు, ఆటో విడిభాగాల దిగుమతులపై 25 శాతం సుంకాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకి పెంపు నిర్ణయం తీసుకుంది. కంపెనీ వివరాల ప్రకారం, గ్రాండ్ విటారా మోడల్ అత్యధికంగా రూ. 62,000 వరకు ఖరీదు కానుంది. ఈకో మోడల్ రూ. 22,500, వ్యాగన్-ఆర్ రూ. 1,4000, ఎర్టిగా రూ. 12,500, ఎక్స్ఎల్6 రూ. 12,500, డిజైర్ టూర్ ఎస్ రూ. 3,000, ఫ్రాంక్స్ రూ. 2,500 వరకు పెరగనున్నాయి. ఇదివరకు కంపెనీ జనవరి 1, ఫిబ్రవరి 1, మార్చి 17 తేదీల్లో ధరల పెంపును ప్రకటించింది.

Next Story