- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maruti Suzuki: ప్రపంచ అత్యంత విలువైన కార్ల కంపెనీల టాప్-10 జాబితాలో మారుతీ సుజుకి
ప్రధానంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల చర్యలు ఇందుకు దోహదపడ్డాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్-10 వాహన తయారీ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది.. దాదాపు 57.6 మిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 511 కోట్ల) మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో జాబితాలో ఎనిమిదవ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇది వోక్స్‌వ్యాగన్, ఫోర్డ్, జనరల్ మోటార్స్ లాంటి ఆటోమేకర్లను అధిగమించి. మారుతీ సుజుకి కంపెనీ మార్కెట్ విలువ పెరిగేందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, ప్రధానంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల చర్యలు ఇందుకు దోహదపడ్డాయి. దేశీయ వాహన మార్కెట్లో మారుతీ సుజుకి బడ్జెట్ ధరల కార్లతో ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. తాజా జీఎస్టీ సంస్కరణలతో తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న కార్లపై జీఎస్టీ సుమారు 10 శాతం తగ్గడంతో కంపెనీకి చెందిన ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్ వంటీ కార్లు మరింత సరసమైన ధరకు చేరాయి. దీంతో ఎక్కువమంది వినియోగదారులు మారుతీ సుజుకి కార్లు కొనేందుకు భారీగా బుకింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే కంపెనీ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది.
ప్రపంచ ఆటోమేకర్స్ ర్యాంకుల్లో అమెరికాకు చెందిన టెస్లా 1.4 ట్రిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో టయోటా (314 బిలియన్ డాలర్లు), మూడవ స్థానంలో బీవైడీ (134.06 బిలియన్ డాలర్లు), నాలుగవ స్థానంలో ఫెరారీ (92.7 బిలియన్ డాలర్లు), ఐదవ స్థానంలో బీఎండబ్ల్యూ (61.3 బిలియన్ డాలర్లు), ఆరవ స్థానంలో మెర్సిడెస్ బెంజ్(59.8 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. ఏడో స్థానంలో హోండా(59 బిలియన్ డాలర్లు), ఎనిమిదవ స్థానంలో మారుతీ సుజుకి(57.6 బిలియన్ డాలర్లు), తొమ్మిదవ స్థానంలో జనరల్ మోటార్స్(57.1 బిలియన్ డాలర్లు), ఫోక్స్‌వ్యాగన్(55.7 బిలియన్ డాలర్లు)తో పదో స్థానంలో ఉంది.






