జీఎస్టీ ఎఫెక్ట్‌..5 ల‌క్ష‌ల్లోపు కార్లు కొనేవారికి బంప‌ర్ ఆఫ‌ర్.. 1.29 లక్ష‌ల డిస్కౌంట్‌ !

by velandi.Saikiran |

ఐదు లక్షల లోపు.. సులభంగా సామాన్య ప్రజలు కూడా కార్లు కొనుగోలు చేయవచ్చని ప్రకటన చేసింది మారుతి సుజుకి. సెప్టెంబర్ 23వ తేద

జీఎస్టీ ఎఫెక్ట్‌..5 ల‌క్ష‌ల్లోపు కార్లు కొనేవారికి బంప‌ర్ ఆఫ‌ర్.. 1.29 లక్ష‌ల డిస్కౌంట్‌ !
X

దిశ, వెబ్ డెస్క్ : బడ్జెట్లో కార్లు కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది మారుతి సుజుకి. జీఎస్టీ శ్లాబ్ లో మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో.. తమ కార్ల ధరలను తగ్గించినట్లు వెల్లడించింది. దీంతో ఐదు లక్షల లోపు.. సులభంగా సామాన్య ప్రజలు కూడా కార్లు కొనుగోలు చేయవచ్చని ప్రకటన చేసింది మారుతి సుజుకి. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి.

జీఎస్టీ లో మార్పులు చేసిన తర్వాత... మారుతి సుజుకి కార్ల పైన 1.29 లక్షల నుంచి 40 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇక సామాన్యులు కూడా కొనుగోలు చేసే ఎస్ ప్రెసో కారు పైన 1.29 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. అంటే ఎక్స్ షోరూం ప్రకారం 3.49 లక్షలకు ఈ కారు రానుంది. అలాగే ఆల్టో k10 కారు పైన లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది.

అంటే ఎక్స్ షోరూం ప్రకారం ఈ కారు ధర 3.69 లక్షలు ఉండనుంది. సెలారియో కారు పైన 94 వేల రూపాయల డిస్కౌంట్ వస్తుంది. ఈ కారు బేస్ మోడల్ ప్రస్తుత ధర 4.69 లక్షలు ఉంది. అలాగే వ్యాగన్ఆర్ కారు పైన దాదాపు 80 వేల డిస్కౌంట్ వస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 4.98 లక్షలు గా ఉంది. అటు షిఫ్టు, బలేనో, షిఫ్ట్ డిజైర్ కార్లపై కూడా దాదాపు 80 వేలకు పైగా డిస్కౌంట్ అందిస్తున్నారు.

Next Story