- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maruti Suzuki: ఎస్‌యూవీ మోడల్ ఫ్రాంక్స్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసిన మారుతీ సుజుకి
ఫలితంగా కారు ధరను 0.5 శాతం మేర పెంచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన ఎస్‌యూవీ మోడల్ ఫ్రాంక్స్‌లో 6 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. కారు ప్రమాదాలను తగ్గించేందుకు బేసిక్ మోడల్ మొదలుకొని అన్ని కార్లలో 6 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న సమయంలో మారుతీ సుజుకి క్రమంగా తన మోడళ్లలో దీన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే పలు కార్లలో దీన్ని తెచ్చిన తర్వాత, కొత్త ఫ్రాంక్స్‌లోనూ 6 ఎయిర్‌బ్యాగులు అందిస్తున్నట్టు తెలిపింది. దీని ఫలితంగా కారు ధరను 0.5 శాతం మేర పెంచింది. పెంచిన ధరలు జూలై 25 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అంతకుముందు రోజే కంపెనీ తన ఫ్రాంక్స్ మోడల్ విడుదలైన 25 నెలలకే లక్ష యూనిట్ల ఎగుమతులు సాధించినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024-25లో 69 వేలకు పైగా ఫ్రాంక్స్ కార్లను విదేశాలకు పంపిన కంపెనీ, ఒక ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి చేసిన ప్యాసింజర్ వాహనాల్లో నంబర్ 1గా నిలిచింది. కాగా, ఇటీవలే కంపెనీ తన ఎక్స్ఎల్6 కారులోనూ ఆరు ఎయిర్‌బ్యాగులను అమర్చినట్టు వెల్లడించింది. దానికోసం కారు ధర 0.8 శాతం పెంచామని పేర్కొంది. ఇక, ఇంతకుముందు ఎర్టిగా, బలెనో కార్లలోనూ కంపెనీ ఆరు ఎయిర్‌బ్యాగులను సాధారణం చేస్తూ నిర్ణయం తీసుకుంది.






