- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maruti Suzuki: అరుదైన రికార్డు సాధించిన మారుతీ సుజుకి
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 23 లక్షలకు పైగా కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా కీలక మైలురాయిని సాధించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 23 లక్షలకు పైగా కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా కీలక మైలురాయిని సాధించింది. ప్రముఖ వాహన తయారీదార్ల సంఘం సియామ్ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం, 2025-26లో కంపెనీ 23.4 లక్షలతో చరిత్రలోనే అత్యధిక కార్లను తయారు చేసింది. ఏడాది కాలంలో ఇన్ని కార్లను ఉత్పత్తి చేసిన ఏకైక కంపెనీగా కూడా మారుతీ సుజుకి నిలిచింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీ స్థాయిలో కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం తమదేనని కంపెనీ పేర్కొంది. చాలా తక్కువ కంపెనీలు మాత్రమే ఒకే దేశంలో ఇంత భారీ పరిమాణంలో ఉత్పత్తి చేయగలవని మారుతీ సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేచి అన్నారు. ఉద్యోగులు, వెండర్లు, డీలర్ల దీర్ఘకాలిక భాగస్వామ్య మద్దతుతో, నాలుగున్నర దశాబ్దాలుగా రూపొందిన ఆటోమొబైల్ ఎకోసిస్టమ్ వల్లే ఈ రికార్డు సాధ్యమైందని ఆయన వెల్లడించారు. మొత్తం ఈ రికార్డు ఉత్పత్తిలో డిజైర్, స్విఫ్ట్, బలెనో, ఫ్రాంక్స్, ఎర్టిగా మోడళ్లు 2 లక్షల కంటే ఎక్కువ ఉత్పత్తి అయినట్టు స్పష్టం చేశారు.






