Maruti Suzuki: కార్ల ధరలు పెంచిన మారుతీ సుజుకి

by S Gopi |

సవరించిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, ధరల పెరుగుదల మోడల్‌ను బట్టి మారుతుందని స్పష్టం చేసింది.

Maruti Suzuki: కార్ల ధరలు పెంచిన మారుతీ సుజుకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్యాసింజర్ల వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. భారంగా మారిన ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. సవరించిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, ధరల పెరుగుదల మోడల్‌ను బట్టి మారుతుందని స్పష్టం చేసింది. గత కొంతకాలంగా వాహనాల తయారీలో ముడి సరుకుల ధరలు అధికంగా పెరిగాయి. దీనికితోడు మారుతున్న కస్టమర్ అవసరాలకు అనుగుణంగా నిర్వహణ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే కొంతభారాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పడంలేదని కంపెనీ వివరించింది. అయితే, సాధ్యమైనంత వరకు ఖర్చులను నియంత్రించేందుకు, కస్టమర్లపై ఎక్కువ ప్రభావం పడకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ అధికారిక వివరాల ప్రకారం అన్ని కార్ల ధరలు పెరగ్గా, గరిష్ఠంగా రూ. 32,500 వరకు పెంచినట్టు తెలుస్తోంది. కనిష్ఠంగా సియాజ్, జిమ్నీ మోడళ్లపై రూ. 1,500 మాత్రమే పెంచింది. మిగిలిన కార్ల ధరలు రూ. 5 వేల నుంచి రూ. 30 వేల వరకు పెరిగాయి.

Next Story