Maruti Suzuki: తొలి ఈవీ కారు విడుదల చేసిన మారుతీ సుజుకి

by S Gopi |

ఈ కారు బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్(బాస్) మోడల్ ఆధారంగా లభిస్తుంది. అంటే బ్యాటరీ కోసం ఈఎంఐ రూపంలో కిలోమీటర్‌కు రూ. 3.99 చొప్పున విడిగా చెల్లించాల్సి ఉంటుంది.

Maruti Suzuki: తొలి ఈవీ కారు విడుదల చేసిన మారుతీ సుజుకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల దిగ్గజం మారుతీ సుజుకి ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విభాగంలోకి అడుగుపెట్టింది. మంగళవారం కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురూచుస్తున్న తన మొట్టమొదటి ఈవీ ఎస్‌యూవీ ఈ-విటారా లాంచ్ చేస్తూ, ధరల వివరాలను కూడా ప్రకటించింది. రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో తీసుకొచ్చిన ఈ కారు బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్(బాస్) మోడల్ ఆధారంగా లభిస్తుంది. అంటే బ్యాటరీ కోసం ఈఎంఐ రూపంలో కిలోమీటర్‌కు రూ. 3.99 చొప్పున విడిగా చెల్లించాల్సి ఉంటుంది. 8 ఏళ్ల బ్యాటరీ వారెంట్‌తో అందుబాటులో ఉన్న ఈ కారు 49 కిలోవాట్ అవర్, 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేసిన తర్వాత 440 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 61 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 543 కిలోమీటర్లు వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది. ఈ కారును కొనాలనుకునే కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ సెంటర్ల వద్ద రూ.21 వేలు చెల్లించి బుకింగ్ చేయవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభం అవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, త్వరలో పూర్తి వేరియంట్ వారీగా ధరల వివరాలను వెల్లడించనున్నట్టు తెలిపింది. గతేడాది ఆగష్టులోనే కంపెనీ ఈ-విటారా ఉత్పత్తిని ప్రారంభించింది. ఏడాది ఆఖరు నాటికి సుమారు 13 వేల యూనిట్లను 28 దేశాలకు ఎగుమతి కూడా చేసింది.

Next Story