- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maruti Suzuki: ఎగుమతుల్లో మారుతీ సుజుకి రికార్డులు
కేవలం 25 నెలల్లోనే లక్ష ఫ్రాంక్స్ ఎస్‌యూవీలను ఎగుమతి చేసింది

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాహనాల ఎగుమతుల్లో ప్యాసింజర్ కార్ల దిగ్గజం మారుతీ సుజుకి రికార్డులు నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా 96,000 యూనిట్లకు పైగా ఎగుమతులు చేసినట్టు గురువారం ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా కంపెనీ మోడల్ ఫ్రాంక్స్ భారత్ నుంచి లక్ష యూనిట్ల ఎగుమతులతో అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీగా నిలిచింది. గుజరాత్‌లో కంపెనీకి చెందిన ప్లాంట్ నుంచి కేవలం 25 నెలల్లోనే లక్ష ఫ్రాంక్స్ ఎస్‌యూవీలను ఎగుమతి చేసింది. భారత్ నుంచి ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లోనూ మారుతీ సుజుకి ఈ త్రైమాసికంలో 47 శాతం వాటాను సొంతం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం కంపెనీ దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తోంది. గత 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తం కంపెనీ ఎగుమత్లు 3.3 లక్షల యూనిట్లను అధిగమించాయి, ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఎగుమతుల్లోనే అత్యధికం. ప్రధానంగా దక్షిణాఫ్రికా, జపాన్, సౌదీ అరేబియాలకు కంపెనీ తన కార్లను ఎగుమతులు చేస్తోంది. ప్యాసింజర్ వాహనాల ఎగుమతులను నిరంతరం కొనసాగించేందుకు మారుతీ సుజుకి ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్ల పట్ల దృష్టి సారిస్తూనే ఉంటుందని కంపెనీ సీఈఓ, ఎండీ హిసాషి టకెయుచి పేర్కొన్నారు.






