Maruti Suzuki: స్టార్టప్‌లతో చేతులు కలిపిన మారుతీ సుజుకి

by S Gopi |

మినీమైన్స్ అనే స్టార్టప్ కాలం చెల్లిన లిథియం-అయాన్ బ్యాటరీలను సురక్షితంగా రీసైక్లింగ్ చేసి, వాటిలోని విలువైన లోహాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావడంపై పనిచేస్తుంది.

Maruti Suzuki: స్టార్టప్‌లతో చేతులు కలిపిన మారుతీ సుజుకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశీయ ప్యాసింజర్ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకి ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఐదు స్టార్టప్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీటిలో మినీమైన్స్ అనే స్టార్టప్ కాలం చెల్లిన లిథియం-అయాన్ బ్యాటరీలను సురక్షితంగా రీసైక్లింగ్ చేసి, వాటిలోని విలువైన లోహాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావడంపై పనిచేస్తుంది. మిగిలిన నాలుగు స్టార్టప్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), జనరేటివ్ ఏఐ ఆధారంగా కొనుగోలు ప్రక్రియలను ఆటోమేట్ చేయడం, కస్టమర్ సేవలను మెరుగుపరచడం, బ్రాండ్ విజిబిలిటీ పెంచడం, సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని వేగవంతం చేయడం వంటి పరిష్కారాలను అందించనున్నాయి. వ్యాపార సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుగొనడంలో స్టార్టప్‌లు కీలక భాగస్వాములుగా మారుతున్నాయని కంపెనీ ఎండీ, సీఈఓ హిసాషి టకేయుచి అన్నారు. ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్‌తో పాటు, ఏఐ ఆధారిత పరిష్కారాల ద్వారా కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ని మెరుగుపరచడం, సంస్థ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చడమే ఈ ఒప్పందాల లక్ష్యమని వివరించారు.

Next Story