- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: స్టాక్ మార్కెట్లకు ఐటీ దెబ్బ
అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు మన మార్కెట్లను దెబ్బతీశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు నమోదయ్యాయి. కొత్త ఏఐ టూల్స్ కారణంగా ఐటీ రంగంపై ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. దీనికితోడు అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు మన మార్కెట్లను దెబ్బతీశాయి. ముఖ్యంగా ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ కొత్త టూల్ క్లాడ్ కోడ్‌ను విడుదల చేసింది. దీన్ని ఉపయోగించి ఎప్పటినుంచో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొబొల్ కోడ్‌ను తక్కువ ఖర్చుతో, వేగంగా అప్‌గేడ్ చేయవచ్చని ఆంథ్రోపిక్ వెల్లడించింది. ఈ కొబొల్ లాంగ్వేజ్‌ను ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రభుత్వాలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు వాడుతున్న ఐబీఎమ్ కంప్యూటర్లలో ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆంథ్రోపిక్ కొత్త టూల్ కారణంగా ఐబీఎమ్ వ్యాపారం ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగంలోనూ ఆంథ్రోపిక్ ఒత్తిడి కొనసాగుతోంది. వీటితో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ గురించి వ్యాఖ్యలు చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1068.74 పాయింట్లు పతనమై 82,225కి, నిఫ్టీ 288.35 పాయింట్లు క్షీణించి 25,424 వద్ద ముగిశాయి. ఓ దశలో సెన్సెక్స్ ఇండెక్స్ 1,300 పాయింట్లకు పైగా కుదేలైంది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ మదుపర్ల సంపద రూ. 3.33 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 469.19 లక్షల కోట్ల నుంచి రూ. 465.85 లక్షల కోట్లు చేరింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 90.93 వద్ద ఉంది.






