- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దీనికితోడు ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్ స్టక్స్‌లో కొనుగోళ్ల కారణంగా మార్కెట్లలో ర్యాలీ జరిగింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం లాభాలను సాధించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు, మన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పుంజుకుంది. దీనికితోడు ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్ స్టక్స్‌లో కొనుగోళ్ల కారణంగా మార్కెట్లలో ర్యాలీ జరిగింది. గ్లోబల్ మార్కెట్లపై బలహీన యూఎస్ డాలర్, 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఒత్తిడి ఉన్నప్పటికీ మదుపర్లు పూర్తిగా దేశీయ పరిణామాల ఆధారంగా క్రయవిక్రయాలు జరిపారు. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 934 కోట్ల విలువైన నిధులను వెనక్కి తీసుకెళ్లినప్పటికీ, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 2,600 కోట్ల కంటే ఎక్కువ విలువైన షేర్లను కొనుగోలు చేయడంతో ర్యాలీ కొనసాగింది. మన స్టాక్ మార్కెట్లతో పాటు ఆసియా ప్రాంతంలో హాంకాంగ్ హాంగ్ సెంగ్ 2.53 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 1 శాతం పెరిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 479.95 పాయింట్లు లాభపడి 83,294కి, నిఫ్టీ 141.75 పాయింట్లు పెరిగి 25,713 వద్ద ముగిశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 90.94 వద్ద ఉంది. ఆదివారం ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుకు చెందిన చండీగఢ్‌లోని ఓ బ్రాంచులో రూ. 590 కోట్ల భారీ మోసం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం సోమవారం బ్యాంకు షేర్లు ఏకంగా 16 శాతం పతనమై రూ. 70.09 వద్ద స్థిరపడింది.






