- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Byju's: బైజూస్‌ను కొనేందుకు మరోసారి బిడ్‌ను సమర్పించిన మణిపాల్ గ్రూప్
ఎంఈఎంజీ ఇండియా ఇప్పటికే ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్‌లో గణనీయమైన వాటాను (సుమారు 40 శాతం) కలిగి ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్ బైజూస్‌ను సొంతం చేసుకునేందుకు డాక్టర్ రంజన్ పాయ్ నేతృత్వంలోని మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ ఇండియా (ఎంఈఎంజీ ఇండియా) ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ మేరకు బైజూస్ మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ)లో పాల్గొనడానికి ఎంఈఎంజీ ఇండియా మరోసారి అధికారికంగా ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) సమర్పించింది. ఎంఈఎంజీ ఇండియాకు ఇప్పటికే ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్‌లో గణనీయమైన వాటాను (సుమారు 40 శాతం) కలిగి ఉంది. అయితే, థింక్ అండ్ లెర్న్ ఆస్తులపై నియంత్రణను దక్కించుకోవడం ద్వారా, ఎంఈఎంజీ ఇండియా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ విభాగాలలో తన ఆధిపత్యాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకు థింక్ అండ్ లెర్న్ కంపెనీని దక్కించుకునేందుకు ఏకైక బిడ్డర్‌గా తన ఈఓఐని సమర్పించింది. ఇదే సమయంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఎడ్-టెక్ దిగ్గజం బైజూస్ మాతృ సంస్థను కొనుగోలు చేసి దేశీయంగా ప్రధాన ఎడ్యుకేషన్-హెల్త్‌కేర్ గ్రూప్‌గా తన కార్యకలాపాలను కొనసాగించాలని భావిస్తోంది. దీనివల్ల బైజూస్ ఆస్తులు ఎంఈఎంజీ ఇండియా ప్రస్తుత వ్యాపారంలో భాగమవుతాయి. ఈ కొనుగోలు ద్వారా దేశంలో ఎడ్యుకేషన్-టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని ఆశిస్తోంది.






