- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కార్పియో-ఎన్ ధరను మరో రూ. 51 వేలు పెంచిన మహీంద్రా!
by Chintha Aamani |
దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన ఎస్‌యూవీ మోడల్ స్కార్పియో-ఎన్ ధరను మరోసారి పెంచింది.

X
న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన ఎస్‌యూవీ మోడల్ స్కార్పియో-ఎన్ ధరను మరోసారి పెంచింది. ఈ ఏడాది జనవరిలో పెంచిన తర్వాత నాలుగు నెలల వ్యవధిలో ఈ మోడల్ ధరను పెంచడం ఇది రెండోసారి. కంపెనీ తాజా ప్రకటన ప్రకారం, మహీంద్రా స్కార్పియో-ఎన్ ధరను రూ. 51,299 పెంచింది. దాంతో ఈ మోడల్ ఎంట్రీ-లెవల్ జ్2 పెట్రోల్ వేరియంట్ ధర రూ. 13.06 లక్షలుగా ఉంది. డీజిల్ వేరియంట్ ధర రూ. 13.56 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ జ్8ఎల్ 7-సీటర్ ధర రూ. 24.51 లక్షలుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశంలో ఈ నెల నుంచి రెండో దశ బీఎస్6 ప్రమాణాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కంపెనీలకు వాహన తయారీ ఖర్చు పెరిగింది. అందుకోసమే స్కార్పియో-ఎన్ అన్ని వేరియంట్ల ధరలు పెంచుతున్నట్టు కంపెనీ పేర్కొంది.
Next Story






