M&M: ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో భారత బ్రాండ్ల జోరు

by S Gopi |

కంపెనీలు కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణిస్తున్నాయని బ్రాండ్ ఫైనాన్స్ అభిప్రాయపడింది

M&M: ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో భారత బ్రాండ్ల జోరు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆటోమొబైల్ రంగం ప్రపంచవ్యాప్తంగా ఉనికిని మరింత విస్తరిస్తోంది. తాజాగా బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన గ్లోబల్ టాప్ 100 కంపెనీల జాబితాలో భారత్‌కు చెందిన ఎనిమిది బ్రాండ్లు చోటు దక్కించుకున్నాయి. ఈ కంపెనీలు కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణిస్తున్నాయని బ్రాండ్ ఫైనాన్స్ అభిప్రాయపడింది. నివేదిక ప్రకారం, ఈ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ బ్రాండ్ విలువ 17 శాతం పెరిగి 3.8 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా 25వ స్థానానికి ఎగబాకింది. కంపెనీ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియో, ఈవీలోకి ఎంట్రీ ద్వారా ఈ వృద్ధిని సాధించింది. ఇదే సమయంలో ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బలమైన గ్లోబల్ డిమాండ్‌తో ప్రపంచంలో మూడవ అత్యంత బలమైన ఆటో బ్రాండ్‌గా నిలిచింది. కంపెనీ బ్రాండ్ విలువ 30 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్లకు చేరింది. అలాగే, టాటా మోటార్స్ 3.3 బిలియన్ డాలర్లతో 5వ ర్యాంక్, మారుతీ సుజుకి 2.7 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 34వ ర్యాంక్ సాధించాయి. వీటితో పాటు టీవీఎస్ మోటార్ కంపెనీ, అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ కంపెనీలు కూడా మెరుగైన ర్యాంకులను సాధించాయి.

Next Story