- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
M&M: జీఎస్టీ తగ్గింపు సహా రూ. 2.56 లక్షల వరకు అదనపు డిస్కౌంట్లు ప్రకటించిన మహీంద్రా
మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ. 2.56 లక్షల వరకు రాయితీలు ఇస్తామని పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: పండుగ సీజన్, జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఆటో పరిశ్రమ భారీ డిమాండ్‌ను చూస్తోంది. ఇదే సమయంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు సైతం పన్ను తగ్గింపు ప్రయోజనాలతో పాటు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) పండుగ సీజన్ సందర్భంగా జీఎస్టీ సంబంధిత ధరలను తగ్గించడమే కాకుండా అదనంగా డిస్కౌంట్లను ఇస్తున్నట్టు బుధవారం ప్రకటనలో వెల్లడించింది. మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ. 2.56 లక్షల వరకు రాయితీలు ఇస్తామని పేర్కొంది. ముఖ్యంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎస్‌యూవీల విభాగంలో ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తోంది. గ్రామీణ మార్కెట్ కోసం ప్రత్యేకంగా ధరల ప్రయోజనాలతో పాటు ఈ20 ఇంధన వాహనాలపై ఎక్కువ వారెంటీ ఇస్తామని కంపెనీ తెలిపింది.
జీఎస్టీ, ఫెస్టివల్ డిస్కౌంట్లు
* థార్ రాక్స్: ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.25 లక్షల నుంచి ప్రారంభం. జీఎస్టీ కింద రూ. 1.33 లక్షల వరకు, అదనంగా రూ. 20,000 ప్రయోజనాలను పొందవచ్చు.
* ఎక్స్‌యూవీ700: రూ. 13.66 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి, జీఎస్టీ రూ. 1.43 లక్షల వరకు, అదనపు ప్రయోజనాలు రూ. 81,000.
* బొలెరో నియో: రూ. 8.92 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం, జీఎస్టీ రూ. 1.27 లక్షల వరకు, అదనపు ప్రయోజనాలు రూ. 1.29 లక్షల వరకు లభిస్తాయి.
ప్రయోజనాలు ఎంచుకున్న మోడల్, వేరియంట్‌పై ఆధారపడి ఉంటాయని మహీంద్రా తెలిపింది.
ఈ20 ఇంధన వాహనాలపై వారెంటీ హామీ
ఈ20 ఇంధనంతో నడుస్తున్న వాహనాలకు అన్ని వారెంటీ సౌకర్యాలు ఉంటాయని ఎంఅండ్ఎం స్పష్టం చేసింది. మహీంద్రా ఇంజన్లు గ్యాసోలిన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, ఈ20 ఇంధనంతో సురక్షితంగా నడపవచ్చని నొక్కి చెప్పింది.






