Anand Mahindra: మిస్టర్ టి.. గుడ్ బై.. వైరల్ అవుతోన్న ఆనంద్ మహీంద్రా పోస్ట్

by Naga Rani Yarlagadda |

రతన్ టాటా లేరన్న నిజాన్ని అంగీకరించలేకపోతున్నానన్నారు ఆనంద్ మహీంద్రా. లెజెండ్స్ కు ఎప్పటికీ మరణం ఉండని, ఆయనెప్పడూ మనందరి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుంటారు.

Anand Mahindra: మిస్టర్ టి.. గుడ్ బై.. వైరల్ అవుతోన్న ఆనంద్ మహీంద్రా పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: టాటా సంస్థల ఛైర్మన్ రతన్ టాటా(86) ఇక లేరన్న నిజాన్ని అంగీకరించలేకపోతున్నానని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మకమైన స్థానంలో ఉండటానికి రతన్ టాటా దేశానికి అందించిన సేవలు కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ఆయన మార్గదర్శకత్వం భవిష్యత్ తరానికి ఎంతో అమూల్యమైనదని తెలిపారు. ఆయన సంస్కరణలను పాటించడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. "మిస్టర్ టి (Mister T) కి ఇక గుడ్ బై. మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోను.. ఎందుకంటే లెజెండ్స్ కు ఎప్పటికీ చావు ఉండదు" అని ఎక్స్ లో చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు.

Next Story