- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FDI : విదేశీ పెట్టుబడుల్లో మహారాష్ట్ర టాప్.. తెలంగాణ ఎన్నో ప్లేస్ అంటే?
2024-25 సంవత్సరంలో మనదేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(FDI) మహారాష్ట్ర(Maharashtra), కర్నాటక(Karnataka) రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : 2024-25 సంవత్సరంలో మనదేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(FDI) మహారాష్ట్ర(Maharashtra), కర్నాటక(Karnataka) రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయి. తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత్ కు మొత్తం 81.04 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. దీనిలో మహారాష్ట్ర, కర్ణాటక కలిసి ఏకంగా 51% వాటా సాధించాయి. మహారాష్ట్ర 19.6 బిలియన్ డాలర్లు (31%), కర్నాటక 6.62 బిలియన్ డాలర్ల (13%) విదేశీ పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ రాష్ట్రాల్లో బలమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బెంగళూరు టెక్ హబ్, ముంబై ఆర్థిక కేంద్రం, స్నేహపూర్వక వ్యాపార విధానాలు కీలకంగా ఉన్నాయని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) డేటా తెలిపింది.
ఈ రెండు రాష్ట్రాల తర్వాత ఢిల్లీ ($6 బిలియన్), గుజరాత్ ($5.71 బిలియన్), తమిళనాడు ($3.68 బిలియన్), హర్యానా ($3.14 బిలియన్), తెలంగాణ ($3 బిలియన్) ఉన్నాయి. సేవలు, సాఫ్ట్‌వేర్, ట్రేడింగ్ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు రాగా.. సింగపూర్, మారిషస్, అమెరికా నుంచి ఎక్కువ FDI వచ్చింది. భారత్‌లో సంస్కరణలు, సులభమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు ఈ వృద్ధికి దోహదపడ్డట్టు నిపుణులు చెబుతున్నారు.






