- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Apple: ఐఫోన్ ఎస్ఈ సహా పలు మోడళ్లకు యాపిల్ గుడ్‌బై
తొలగించిన స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్ ఎస్ఈ, 14, 14 ప్లస్, 15, 15 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ ఉన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది అనేక రకాల స్మార్ట్‌ఫోన్ మోడళ్లతో పాటు ఐప్యాడ్, మ్యాక్, వాచ్, ఇతర డివైజ్‌లను గుడ్‌బై చెప్తోంది. థర్డ్ పార్టీ రిటైల్ స్టోర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి చోట్ల ఆయా ఫోన్లు అందుబాటులో ఉంటాయి. కానీ, స్టాక్ పూర్తయిన తర్వాత అవి కూడా మార్కెట్ల నుంచి పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. యాపిల్ సంస్థ అమ్మకాల ఉంచి తొలగించిన స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్ ఎస్ఈ, 14, 14 ప్లస్, 15, 15 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. అలాగే, ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఆగిపోవడం మూలంగా టచ్ ఐడీ, హోమ్ బటన్, స్మాల్ స్క్రీన్, ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉన్న ఏ ఫోన్‌ను విక్రయించదు. ఐప్యాడ్‌లకు సంబంధించి ఐప్యాడ్ ప్రో(ఎం4 చిప్), ఐప్యాడ్ ఎయిర్ (ఎం2), ఐప్యాడ్(10 జనరేషన్), యాపిల్ వాచ్ అల్ట్రా 2, యాపిల్ వాచ్ సిరీస్ 10, యాపిల్ వాచ్ ఎస్ఈ (సెకెండ్ జనరేషన్) సహా మ్యాక్‌బుక్‌లో పలు డివైజ్‌లను కూడా అమ్మకాల నుంచి తొలగించింది. ఇతర పరికరాల్లో ఎయిర్‌పాడ్స్ ప్రో(సెకెండ్ జనరేషన్), విజన్ ప్రో(ఎం2 వెర్షన్) వంటి వాటి విక్రయాలను నిలిపేసింది.






