- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LTI Mindtree: రెండు దశల్లో వేతన పెంపు అమలు చేయనున్న ఎల్‌టీఐ మైండ్‌ట్రీ
మొదటి దశలో మొత్తం ఉద్యోగుల్లో సుమారు 50 శాతం మందిని కవర్ చేస్తామని తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఐటీ సేవల కంపెనీ ఎల్‌టీఐ మైండ్‌ట్రీ ఉద్యోగుల వేతన పెంపు విషయంపై కీలక ప్రకటన విడుదల చేసింది. కంపెనీ తన వార్షిక వేతన పెంపు ప్రక్రియను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నుంచి ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. మొదటి దశలో మొత్తం ఉద్యోగుల్లో సుమారు 50 శాతం మందిని కవర్ చేస్తామని తెలిపింది. కంపెనీ కార్యకలాపాల లాభాలపై పడే ప్రభావాన్ని నియంత్రించడానికి, జీతాల పెంపును రెండు త్రైమాసికాల్లో అంటే రెండు దశల్లో పెంపును అమలు చేస్తాం. తొలి దశ పెంపు 2026-27, నాలుగో త్రైమాసికం, 2026-27 మొదటి త్రైమాసికంలో ఇది అమలవుతుందని ఎల్‌టీఐ మైండ్‌ట్రీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ విపుల్ చంద్ర అన్నారు. రెండు దశల్లో వేతన పెంపు తేదీ, ఎంత పెంపు ఉంటుందనే విషయాలను తర్వాత వెల్లడిస్తామని కంపెనీ సీఈఓ, ఎండీ వేను లాంబు చెప్పారు. సాధారణంగా వేతనాల పెంపు కారణంగా ఆ త్రైమాసికంలో కంపెనీ లాభాలపై 1 శాతం వరకు ప్రభావం ఉంటుంది. దీన్ని అధిగమించడానికే రెండు దశల్లో అమలు చేయాలని, తద్వారా కలిసొచ్చే నిధులను కంపెనీ కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచేందుకు వినియోగించనున్నట్టు ఆయన వివరించారు. కాగా, ప్రస్తుతం కంపెనీలో మొత్తం 86,958 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.






